HomeLatest Newsనా చీర లాగారు.. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు

నా చీర లాగారు.. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు

Published on

spot_img

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే శాసనసభ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీలోకి వెళ్తుండగా పోలీసులు తన పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారని, తన చీర లాగారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం ఘోరమని ఆమె వాపోయారు. కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

అసెంబ్లీ వద్ద తోపులాట – జగదీష్ రెడ్డికి గాయం

నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు ఆవరణలోనే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాలికి తీవ్ర గాయమైంది.

రేవంత్ రెడ్డికి హెచ్చరిక:

పోలీసుల ప్రవర్తనను, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు, ఎమ్మెల్యేలపై దాడి చేసినందుకుగానూ సీఎం రేవంత్ రెడ్డికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ ఘాటుగా హెచ్చరించారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.