హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి హామీల అమలుతో పాటు, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని నాయకులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


