HomeWarangal Newsఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి, జీవో 97ను రద్దు చేయాలి: బీఆర్‌ఎస్ నేత దాస్యం వినయ్...

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి, జీవో 97ను రద్దు చేయాలి: బీఆర్‌ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్

Published on

spot_img

హనుమకొండ: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం చేకూర్చే జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఓరుగల్లు గడ్డపై శనివారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా హనుమకొండలోని ఏకశిలా పార్కు (ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం) నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులు, యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు చేతబూని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, డీఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నిలిపివేసి ప్రభుత్వం వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల చదువులు, ప్రవేశాలు, పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. అలాగే సాంకేతిక విద్యలో కీలకమైన పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, ఈ నిరసన కార్యక్రమానికి వస్తున్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ, ఆంక్షలను దాటుకుని విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోరాటానికి పూర్తి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles