జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక కారు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ కారులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు. బోర్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి తన కారులో హనుమకొండకు వెళ్తుండగా భూపాలపల్లి మండలం, కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న మలుపు వద్ద కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
కారు పల్టీ కొట్టిన సమయంలో లోపల ఉన్న ఎయిర్ బ్యాగులు వెంటనే తెరుచుకోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న డ్రైవర్, ప్రయాణికులు కేవలం స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


