రాబోయే జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిబ్బంది సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు.
మే నెలలో చేపట్టనున్న జనగణన (Census) విధులకు సంబంధించి సెన్సస్ ఛార్జ్ క్లర్కులు మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలికల కళాశాలలో ఈ శిక్షణను నిర్వహించారు. జనగణన పోర్టల్‌ను ఎలా ఉపయోగించాలి, డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎలా జాగ్రత్తపడాలి అనే విషయాలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు


