HomeWarangal Newsజనగణన శిక్షణను సమన్వయంతో నిర్వహించాలి

జనగణన శిక్షణను సమన్వయంతో నిర్వహించాలి

Published on

spot_img

హనుమకొండ: జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్న రెండు రోజుల జనగణన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా స్థాయి అధికారులు, ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జనగణన తొలి దశలో భాగంగా హౌస్ లిస్టింగ్, హౌస్ బ్లాకింగ్, డేటా ఎంట్రీ ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. తదుపరి జనాభా గణనకు సంబంధించి ఎన్యూమరేషన్ బ్లాక్‌లను క్షుణ్ణంగా సమీక్షించి, అవసరమైన సవరణలను పూర్తి చేయాలని సూచించారు.

జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి పనిభారాన్ని సమానంగా కేటాయించాలని, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ, జనగణన ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు.

శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు సతీష్, ప్రశాంత్ జనగణన విధివిధానాలు, సంబంధిత ప్రక్రియలు, అధికారుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles