స్టేషన్‌ఘన్‌పూర్, ఉమ్మడి వరంగల్:
అతి చిన్న వయసులోనే రాజకీయ రంగంలో అడుగుపెట్టి విజయం సాధించడం అరుదైన విషయం. అలాంటి అరుదైన ఘనతను సాధించారు స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన చల్లా రమ్య. కేవలం 24 ఏళ్ల వయసులోనే మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై అందరితో ఔరా అనిపించుకుంటున్నారు.
ఇటీవల జరిగిన స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఐదో వార్డు జనరల్ మహిళకు కేటాయించబడింది. ఆ వార్డులో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) తరఫున పోటీ చేసిన రమ్య విజయం సాధించారు.
యువతలో రాజకీయాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, రమ్య విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె సాధించిన విజయంపై పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. యువ నాయకత్వానికి ఇది ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


