ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ యూజర్ల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. తమ ఫోటోలు, ఆలోచనలు, జోకులను ఉపయోగించి వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టుగా స్టిక్కర్ ప్యాక్‌లను రూపొందించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఎలా తయారు చేసుకోవాలి? :
చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌ను ఓపెన్ చేసి Images విభాగంలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే Stickers ఆప్షన్‌ను ఎంచుకుని, కావాల్సిన స్టిక్కర్ వివరాలను టెక్స్ట్ ప్రాంప్ట్‌గా ఇవ్వవచ్చు. లేదంటే ఫోన్ గ్యాలరీ నుంచి నేరుగా ఫోటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. పెంపుడు జంతువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫన్నీ ఫొటోలను కూడా స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు.
ఒక్కో ప్యాక్‌లో 9 స్టిక్కర్లు :
ఒక్క స్టిక్కర్ ప్యాక్‌లో గరిష్టంగా తొమ్మిది స్టిక్కర్లను రూపొందించుకునే అవకాశం ఉంది. యూజర్ల అభిరుచికి అనుగుణంగా 18 రకాల విజువల్ స్టైల్స్‌ను ఎంచుకోవచ్చు. యానిమే, 3D, హోలోగ్రాఫిక్ వంటి థీమ్స్‌తో పాటు ఎమోజీలను జోడించడం, రూపొందించిన స్టిక్కర్లను షేర్ చేయడానికి ముందు ఎడిట్ చేయడం వంటి ఆప్షన్లు ఉన్నాయి.
వాట్సాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు:
ఈ స్టిక్కర్లు పారదర్శక బ్యాక్‌గ్రౌండ్‌తో రూపొందుతాయి. దీంతో మెసేజింగ్ యాప్‌లలో సహజంగా కనిపిస్తాయి. తయారైన ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ వంటి యాప్‌లలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. పూర్తి ప్యాక్‌ను వాట్సాప్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలంటే కనీసం మూడు స్టిక్కర్లు ఉండాలి. అవసరమైతే ఒక్కో స్టిక్కర్‌ను విడిగా కూడా సేవ్ చేసుకోవచ్చు.


