HomeLatest Newsరెండు ఏనుగుల మధ్య తీవ్ర ఫైటింగ్ లో మహిళ మృతి..ఒళ్ళు గగుర్పొడిచే (వీడియో)..!

రెండు ఏనుగుల మధ్య తీవ్ర ఫైటింగ్ లో మహిళ మృతి..ఒళ్ళు గగుర్పొడిచే (వీడియో)..!

Published on

spot_img

కర్ణాటకలోని కొడుగు జిల్లాలో దారుణాతి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వణ్యప్రాణి క్యాంపల్లో రెండు ఏనుగులు కంట్రోల్ తప్పి కొట్టుకున్నాయి. అయితే ఈ ఫైటింగ్ లో ఒక మహిళ టూరిస్ట్ అన్యాయంగా మృతి చెందింది. ఆ రెండు ఏనుగులు ఫైటింగ్ చేసుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న ఒక టూరిస్ట్ మహిళ ఒక ఏనుగు కిందపడి బాగా నలిగిపోయింది. అక్కడ ఉండే వాళ్ళు సహాయం చేయడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో చెన్నై వాసి అయిన 33 ఏళ్ల జూనేశ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

What happened in Kodagu elephant camp?
కర్ణాటకలోని దుబారే ఎలిఫెంట్ క్యాంప్‌లో రెండు ఏనుగులు పోరాడగా, చెన్నైకి చెందిన మహిళ ఒక ఏనుగు కిందపడి మృతి చెందింది.

ఈ సంఘటన అక్కడ తీవ్ర కలకలం రేపింది. దుబేర ఎలిఫెంట్ క్యాంపులో ఈ ఘటన జరిగింది. ఏనుగులకు స్నానాలు చేయిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలియజేశారు. కంచన్, మార్తాండ అనే గజరాజుల మధ్య ఫైటింగ్ జరిగింది. అయితే మావాటిలు వాటిని అదుపులోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చాలా చాలా విపరీతంగా ఆ ఏనుగులను కొట్లాడుకోకుండా ఆపడానికి ట్రై చేశారు. కానీ ఏ ఒక్కరి ప్రయత్నం ఫలించలేదు. అన్ని విఫలమయ్యాయి. గొడవపడ్డ ఏనుగులల్లో ఒకటి బ్యాలెన్స్ తప్పి అక్కడ ఉన్న మహిళ టూరిస్ట్ పై పడింది. దీంతో ఆ మహిళ టూరిస్ట్ బాగా నలిగిపోయింది. అయితే లేచి నిలబడే ప్రయత్నం చేసినా కూడా ఆ ఏనుగు కాలి కింద మహిళ చిక్కుకోవడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మార్తాండ అనే ఏనుగు కాలు కింద పడి చెన్నై టూరిస్ట్ మహిళ జూనేశ్ మృతి చెందింది .

ఆ మహిళ మృతి పట్ల కర్ణాటక అట‌వీశాఖ మంత్రి ఈశ్వ‌ర్ బీ ఖాండ్రే నివాళి అర్పించారు. ఈ ఘటన స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. కొన్ని కొన్ని సార్లు మనం ఊహించనవి జరుగుతూ ఉంటాయి అని అలాంటి ఘటనే ఇది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఆ ఏనుగుల మధ్య ఫైటింగ్ జరిగిన సమయంలో ఆ మహిళ ఎలా చిక్కుకుంది అనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కొందరు ఈ వీడియో చూసి “అయ్యయ్యో పాపం” అంటూ కామెంట్ చేస్తుంటే .. మరి కొంతమంది మాత్రం ఏనుగులు ఫైటింగ్ చేసుకుంటున్న సమయంలో ఆ మహిళ ఇంకొంచెం జాగ్రత్తగా వెనక్కి తప్పుకొని ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Latest articles

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
spot_img

Related Articles