HomeEntertainmentచిరంజీవి విషెస్‌కి పవన్ ఫ్యాన్స్ ఫిదా.. మెగా రేంజ్ అంటే ఇదే..!

చిరంజీవి విషెస్‌కి పవన్ ఫ్యాన్స్ ఫిదా.. మెగా రేంజ్ అంటే ఇదే..!

Published on

spot_img

చిరంజీవి విషెస్‌కి పవన్ ఫ్యాన్స్ ఫిదా.. మెగా రేంజ్ అంటే ఇదే :

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌ను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆయనపై తనకున్న ప్రేమ, గర్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా పవన్ వ్యక్తిత్వం, ప్రజాసేవపై ప్రశంసలు కురిపిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’ అంటూ..:

“కళ్యాణ్ బాబు అంటేనే లక్ష్యంపై స్పష్టత, ఆచరణలో పట్టుదల. చిన్ననాటి నుంచే ఆయనలో ప్రజల పట్ల ఉన్న ఆప్యాయత, బాధ్యతను నేను గమనిస్తూ వచ్చాను. ఏ పని చేపట్టినా దానిపై సంపూర్ణంగా దృష్టి పెట్టడం, తాను వేసే ప్రతి అడుగు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరుకోవడం ఆయన ప్రత్యేకత. ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన, ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది.” మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.

ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది” అని చిరంజీవి పేర్కొన్నారు.

పవన్‌పై అన్నయ్య చిరంజీవి ప్రశంసలు:

తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని చిరంజీవి అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

కళ్యాణ్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, మరింత ఉత్సాహం, శక్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని ప్రార్థిస్తూ.. నా తమ్ముడు కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి తన అభిమానాన్ని, ఆశీస్సులను తెలియజేశారు.

తమ్ముడిపై చిరంజీవి చూపించిన ప్రేమ, ఆప్యాయత, పవన్ ప్రజాసేవపై చేసిన ప్రశంసలు ప్రస్తుతం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అన్నదమ్ముల అనుబంధానికి ఈ పోస్ట్ మరోసారి నిదర్శనంగా నిలిచిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.