వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సిటీ ఆర్ముడ్ విభాగంలో సిటీ గార్డ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
కాజీపేటలోని ఫాతిమా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వెంకట్ రెడ్డిని చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.


