ప్రజాయుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దరన్న విగ్రహ ఏర్పాటు కోసం హనుమకొండ జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి వివిధ ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, గద్దర్ విగ్రహ స్థాపన కోసం హనుమకొండ జిల్లా కలెక్టర్కు సమర్పించిన వినతిపత్రాన్ని వెంటనే అధికారులకు ఫార్వర్డ్ చేసినందుకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో గద్దరన్న పాత్ర అత్యంత కీలకమైందని వారు కొనియాడారు. గద్దర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకుని, పీడిత ప్రజల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గద్దర్ విగ్రహ స్థాపన కమిటీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు, బీసీ జేఏసీ నాయకులు డాక్టర్ తిరునహరి శేషు, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుంచు రాజేందర్, గజాల గోవర్ధన్, గద్దర్ సాంబయ్య, పి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


