జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచ గ్రామానికి సీఎం చేరుకోనున్నారు.
అక్కడ శ్రీ లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, విశ్రాంతి భవనాన్ని ప్రారంభించనున్నారు.
తదనంతరం మధ్యాహ్నం 3 గంటలకు చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సింగరేణి వెయ్యి క్వార్టర్స్ ఎదుట నిర్వహించనున్న ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.


