HomeLatest Newsనేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: రైతు భరోసా నిధుల విడుదల, మేడిగడ్డ...

నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: రైతు భరోసా నిధుల విడుదల, మేడిగడ్డ సందర్శన

Published on

spot_img

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, రైతులకు మేలు చేకూర్చే రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

 సాయంత్రం 4 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రాజెక్టు స్థితిగతులు మరియు ఇతర సాగునీటి అంశాలపై కీలక సమీక్ష నిర్వహిస్తారు.

 అనంతరం కాటారం మండలం నస్తూర్ పల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి రెండో విడత రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాల ఎస్పీలు సంకీర్త్, శబరీష్ ల పర్యవేక్షణలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

డీఎస్పీలు  20 మంది, సీఐలు 50 మంది, ఎస్సైలు 115 మంది సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందిలతో కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచామని, సభా ప్రాంగణం మరియు పర్యటన ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. సీఎం రాక కోసం ఇప్పటికే నస్తూర్ పల్లిలో భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.