తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన జూమ్ సమావేశం ముగిసింది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వాలని, నాయకులు తమకు నచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.
సమష్టిగా పనిచేస్తేనే విజయం సాధ్యమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దానికి రుజువని అన్నారు.
కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో అందరూ కలిసి పనిచేసి విజయం సాధించామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ నాయకులంతా ఐక్యంగా పనిచేసి గెలుపొందాలని సూచించారు.
చైర్మన్, మేయర్ పదవులను ఇప్పటికి ప్రకటించవద్దని, సామాజిక సమీకరణాల ఆధారంగా చైర్మన్లను ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


