హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆయన దౌల్తాబాద్ వెళ్లనున్నారు. స్థానికంగా, హకీంపేట్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ రాత్రికి ఆయన కొడంగల్‌లోనే బస చేయనున్నారు.
పర్యటనలో రెండవ రోజైన రేపు, ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ మరియు 220 పడకల ఆసుపత్రి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


