HomeWarangal Newsపరకాలలో CMRF చెక్కుల పంపిణీ.. 58 మంది లబ్ధిదారులకు రూ.24.27 లక్షల ఆర్థిక సాయం..!

పరకాలలో CMRF చెక్కుల పంపిణీ.. 58 మంది లబ్ధిదారులకు రూ.24.27 లక్షల ఆర్థిక సాయం..!

Published on

spot_img

రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల టౌన్ తో పాటు పరకాల, నడికూడా, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ..”మొత్తం 58 మంది లబ్ధిదారులకు 24 లక్షల27వేల 750 రుపాయిల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చులకోసం ప్రభుత్వం అండగా నడుస్తుందన్నారు. ప్రజలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో పరకాల ఇందిరా మహిళ డైరీ , ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, నూతన రేషన్ కార్డుల పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ,మహాలక్ష్మి పథకం, గ్యాస్ సబ్సిడీ, శ్రీనిధి రుణాలు వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు..!

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.