హన్మకొండ: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో రక్తదానం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పిలుపునిచ్చారు.
హన్మకొండలోని సమీకృత పాలనా భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడంపై ఆమె ప్రశంసలు కురిపించారు. రక్తదానం చేసిన దాతలకు రెడ్ క్రాస్ సంస్థ తరఫున ప్రశంసా పత్రాలను (సర్టిఫికేట్లు) అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రావు, రాజేందర్, జగన్ మోహన్ రావు, డాక్టర్ ప్రవీణ్ కుమార్, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


