ధర్మసాగర్: మండల పరిధిలోని మల్లికుదురు గ్రామంలో జరుగుతున్న సమగ్ర భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును, పొలాల సరిహద్దుల గుర్తింపుతో పాటు భూ వివరాల నమోదు విధానాన్ని ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, అత్యంత పారదర్శకంగా, పక్కాగా సర్వే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా భూ రికార్డులను పక్కాగా నమోదు చేయాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సర్వే సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


