వేలేరు: హనుమకొండ జిల్లా వేలేరులోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, క్రీడా సామగ్రి, తాగునీరు తదితర అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, వారికి అందుతున్న భోజన నాణ్యత, తరగతి గదులు, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిస్సంకోచంగా చెప్పాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల సంక్షేమం, వారి అవసరాలపై పాఠశాల అధికారులతో చర్చించి, మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు.


