HomeWarangal Newsహనుమకొండ చౌరస్తాలో ఘనంగా కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సంబరాలు

హనుమకొండ చౌరస్తాలో ఘనంగా కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సంబరాలు

Published on

spot_img

హనుమకొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ చౌరస్తాలో వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హనుమకొండ చౌరస్తాకు చేరుకుని టపాసులు కాల్చారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, “కాంగ్రెస్ ప్రభుత్వం – రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 1000 రోజులుగా పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందన్నారు. గత పాలకుల నిరంకుశత్వానికి ముగింపు పలుకుతూ, ‘ప్రజా పాలన’ను ప్రజల చెంతకు చేర్చామని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలుతో పాటు, ఉద్యోగాల కల్పన, రైతులకు రుణమాఫీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో తెలంగాణను దేశంలోనే ముందంజలో నిలిపామని, ఈ ప్రగతి ప్రస్థానం ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజా హృదయాల్లో స్థానం సంపాదించుకుందని కొనియాడారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవానికి అందుతున్నాయని, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్, డీసీసీ మీడియా కమిటీ చైర్మన్ మార్క విజయ్ కుమార్ గౌడ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పీసీసీ, డీసీసీ కమిటీల సీనియర్ సభ్యులు, మహిళా నాయకురాళ్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles