HomeLatest Newsఈసీ తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్: ట్యాంక్ బండ్ వద్ద మహా ధర్నా.. సీఈసీ రాజీనామాకు డిమాండ్

ఈసీ తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్: ట్యాంక్ బండ్ వద్ద మహా ధర్నా.. సీఈసీ రాజీనామాకు డిమాండ్

Published on

spot_img

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

 టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ పాల్గొని కాంగ్రెస్ చేపట్టిన పోరాటానికి పూర్తి సంఘీభావం తెలిపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: బసవరాజ్ శ్రీనివాస్

ఈ సందర్భంగా బసవరాజ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోయి, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు తొత్తుగా మారిందని మండిపడ్డారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న అస్పష్ట విధానాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని విమర్శించారు.

 అర్హులైన ఓట్ల తొలగింపు, జాబితాల్లో అనధికారిక మార్పులు–చేర్పులపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న న్యాయమైన ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పలేకపోతోందని ఆరోపించారు.

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పూర్తిగా లోపించాయని, ఓటు హక్కును హరించే ప్రయత్నాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన పవిత్రమైన ఓటు హక్కును, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

ట్యాంక్ బండ్ వద్ద జరిగిన ఈ ధర్నాతో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పీసీసీ అధికార ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.