HomeWarangal Newsస్టేషన్ ఘన్‌పూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Published on

spot_img

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు:

స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, సామాజిక న్యాయం కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. అణగారిన వర్గాలు, మహిళలు, పేదల సమస్యలపై రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ గళం విప్పుతూ, బాధితులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకొని అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గతంలో తెలంగాణలో ప్రజలకు ప్రత్యామ్నాయం లేదన్న భావనతో వ్యవహరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, అదే విధంగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి కూడా ప్రజలు సమాధానం చెబుతారని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...