HomeWarangal Newsసీపీ కార్యాలయానికి వెళ్లేవారికి అలర్ట్.. ఫిర్యాదుల స్వీకరణ సమయాల్లో మార్పు..!

సీపీ కార్యాలయానికి వెళ్లేవారికి అలర్ట్.. ఫిర్యాదుల స్వీకరణ సమయాల్లో మార్పు..!

Published on

spot_img

సీపీ కార్యాలయానికి వెళ్లేవారికి అలర్ట్.. ఫిర్యాదుల స్వీకరణ సమయాల్లో మార్పు :

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి కొత్త సమయాలను అమల్లోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపై పోలీస్ కమిషనర్ ని నేరుగా కలుసుకొని తమ సమస్యలు ఫిర్యాదులు తెలియచేయాలనుకునే వారు అన్ని పని దినాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కమిషనరేట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు.

అయితే కమిషనర్ ని నేరుగా ఆశ్రయించే ముందు బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా కిందిస్థాయి అధికారుల వద్ద తమ ఫిర్యాదును నమోదు చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా సందర్భాలలో లేదా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కమిషనర్ ని కలవాలని సూచించారు.

ఈ విధానం ద్వారా ప్రజల సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత పారదర్శకంగా సమర్థవంతంగా సాగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి ఫిర్యాదును క్రమబద్ధంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు అనవసరంగా ఇబ్బందులు పడకుండా నిర్ణయించిన సమయాల్లోనే కమిషనరేట్ కార్యాలయాన్ని సంప్రదించాలని అలాగే అవసరమైన పత్రాలు ఫిర్యాదు వివరాలతో హాజరు కావాలని సూచించారు. కొత్త సమయాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కమిషనరేట్ అధికారులు కోరారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.