HomeLatest Newsడేటింగ్ పేరుతో డేంజర్ ట్రాప్.. ‘రెంటల్ బాయ్‌ఫ్రెండ్’పై సీపీ సజ్జనార్ హెచ్చరిక

డేటింగ్ పేరుతో డేంజర్ ట్రాప్.. ‘రెంటల్ బాయ్‌ఫ్రెండ్’పై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Published on

spot_img

డేటింగ్ పేరుతో డేంజర్ ట్రాప్.. ‘రెంటల్ బాయ్‌ఫ్రెండ్’పై సీపీ సజ్జనార్ హెచ్చరిక:

హైదరాబాద్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘రెంటల్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ యువతులను హెచ్చరించారు. ఇలాంటి ప్రకటనల వెనుక సైబర్ నేరగాళ్ల మోసపూరిత నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తూ పోస్టు చేశారు.

సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్స్‌ :

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అందమైన యువకుల ఫొటోలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్స్‌ రూపొందిస్తున్నారని సీపీ తెలిపారు. ‘1st August Special – 50% OFF’ అంటూ ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటిస్తూ యువతులను ఆకర్షిస్తున్నారని చెప్పారు. కాఫీ డేట్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా వస్తామంటూ వివిధ ప్యాకేజీలను ప్రచారం చేస్తున్నారని వివరించారు. 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూ.4,499గా ధర నిర్ణయించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ముందుగా డబ్బులు తీసుకుని మాయం:

ఏఐ ద్వారా రూపొందించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన యువకుల ఫొటోలను ఉపయోగించి ఫేక్ ప్రొఫైల్స్‌ ఏర్పాటు చేస్తున్నారని సజ్జనార్ వెల్లడించారు. వాటి ద్వారా పరిచయం పెంచుకుని, చాటింగ్‌లో తియ్యటి మాటలతో యువతులను నమ్మిస్తారని చెప్పారు. ఆ తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ వంటి పేర్లతో డబ్బులు చెల్లించాలని కోరుతారని తెలిపారు. డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా నగదు బదిలీ చేయించుకుని, డబ్బులు అందిన వెంటనే అకౌంట్లను బ్లాక్ చేసి అదృశ్యమవుతున్నారని హెచ్చరించారు.

వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దు:

ఇలాంటి ఆన్‌లైన్ పరిచయాల సమయంలో ఫోన్ నంబర్లు, ఫొటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సీపీ సూచించారు. సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి తర్వాత బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం ఉందన్నారు. అపరిచితులను నమ్మి నేరుగా కలవడం కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.

ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించొద్దు:

సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ప్రకటనలను నమ్మి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయవద్దని సజ్జనార్ సూచించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారని, నేరాలకు పాల్పడుతున్న వారిపై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువతులు, తల్లిదండ్రులు సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడిన వారు లేదా అనుమానాస్పద పోస్టులు, ఆఫర్లు కనిపించిన వారు భయపడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు, cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.