HomeWarangal Newsచిన్నారులతో సీపీ సన్ ప్రీత్ సింగ్ స్నేహ హస్తం: కేరింతలు కొట్టిన విద్యార్థులు

చిన్నారులతో సీపీ సన్ ప్రీత్ సింగ్ స్నేహ హస్తం: కేరింతలు కొట్టిన విద్యార్థులు

Published on

spot_img

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తనలోని మానవీయ కోణాన్ని చాటుకున్నారు. సాధారణంగా ఖాకీ దుస్తుల్లో గంభీరంగా కనిపించే పోలీస్ బాస్, చిన్నారుల పిలుపుకు ముచ్చటపడి వారితో స్నేహపూర్వక కరచాలనం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

‘అరైవ్ ఆలైవ్’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా ఎల్కతుర్తి మండలం చింతల్‌పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు సీపీ విచ్చేశారు. కమిషనర్ గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయంలో, అదే దారిలో స్కూల్ బస్సులో వెళ్తున్న విద్యార్థులు ఆయనను చూసి ఒక్కసారిగా ఉత్సాహానికి గురయ్యారు. కిటికీల గుండా తమ చిట్టి చేతులను బయటకు చాచి, సీపీతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విద్యార్థులు ఆరాటపడ్డారు.

​ విద్యార్థుల ఉత్సాహాన్ని గమనించిన సన్ ప్రీత్ సింగ్ గారు, ఏమాత్రం తడుముకోకుండా వెంటనే వారి వద్దకు వెళ్లి అందరికీ కరచాలనం చేస్తూ పలకరించారు.

​పోలీసులు అంటే భయం కాదు, భరోసా అని చాటిచెప్పేలా ఈ సంఘటన నిలిచింది. సీపీ స్పందనతో విద్యార్థులు బస్సులో కేరింతలు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

​ఈ దృశ్యం అక్కడున్న స్థానికులను, ఇతర పోలీసు అధికారులను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహపూర్వక పోలీసింగ్ (Friendly Policing) కు ఈ ఘటన ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది.

Latest articles

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
spot_img

Related Articles