హన్మకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఎస్సైపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరియు పలు కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
పోలీస్ శాఖలో క్రమశిక్షణ తప్పినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ స్పష్టం చేశారు.


