వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం ఆత్మకూర్ మండలం నీరుకుళ్ళ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను సీపీ నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన సీపీ, లారీల సమస్యను జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ సంతోష్‌తో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రం అధికారులు పాల్గొన్నారు.


