HomeWarangal Newsభూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేస్తే కఠిన చర్యలు.. రౌడీషీటర్లకు సీపీ హెచ్చరిక..!

భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేస్తే కఠిన చర్యలు.. రౌడీషీటర్లకు సీపీ హెచ్చరిక..!

Published on

spot_img

భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేస్తే కఠిన చర్యలు.. రౌడీషీటర్లకు సీపీ హెచ్చరిక..:

వరంగల్ నగరంలో భూ వివాదాలు, సెటిల్మెంట్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే రౌడీషీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

బుధవారం కేయుసి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ కు సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత , ఏసిపి నరసింహారావు, ఇన్స్పెక్టర్ రవికుమార్ స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, స్టోర్ రూములు, కేసులకు సంబంధించిన ప్రాపర్టీ గదులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. అలాగే బాలమిత్ర పోలీస్ స్టేషన్ క్రీడా మైదానాన్ని కూడా సందర్శించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను కమిషనర్ సమీక్షించారు. స్టేషన్ పరిధిలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న రౌడీషీటర్లు ఎవరు..? వారి ప్రస్తుత కార్యకలాపాలు ఏమిటి..? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. “వివాదాలలో జోక్యం చేసుకోవడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలకు అలవాటు పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల పట్ల ఎలాంటి సానుభూతి చూపకుండా చట్టపరమైన చర్యలు కొనసాగించాలని సూచించారు. అలాగే ఆక్టివ్ గా ఉన్న నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు”.

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా స్థానిక సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యంగా విద్యాసంస్థల్లో, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ఎస్ఐలు తమకు కేటాయించిన సెక్టార్లలో నేర నియంత్రణతో పాటు ముందస్తు సమాచార సేకరణ పై దృష్టి సారించాలని తెలిపారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles