HomeWarangal Newsపాలకుర్తి బస్టాండ్ దుస్థితి.. ప్రయాణికుల అవస్థలపై సీపీఎం ఆగ్రహం

పాలకుర్తి బస్టాండ్ దుస్థితి.. ప్రయాణికుల అవస్థలపై సీపీఎం ఆగ్రహం

Published on

spot_img

జనగామ జిల్లా: పాలకుర్తి బస్టాండ్‌లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు :

బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు పాలకుర్తి బస్టాండ్‌ను సందర్శించారు. బస్టాండ్‌లో అధ్వానంగా ఉన్న రహదారులను పరిశీలించి, ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు నిలిపే ప్రాంతంలో రోడ్లు గుంతలమయంగా మారడంతో వర్షాకాలంలో బురద, ఎండాకాలంలో దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

అదనపు బస్సులు నడపాలి :

పాలకుర్తి నుంచి తొర్రూరు, కొడకండ్ల, తిరుమలగిరి, హనుమకొండ, మొండ్రాయి, వరంగల్, దేవరుప్పుల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అదనపు బస్సు ట్రిప్పులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జనగామ నుంచి పాలకుర్తికి రాత్రి 8.30 గంటల తర్వాత బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

బస్టాండ్‌కు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి :

బస్టాండ్ చుట్టూ ప్రహరీ నిర్మించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డు విస్తరణ అనంతరం బస్టాండ్‌ లోపలి రహదారులు దిగువకు వెళ్లిపోయాయని, డ్రైనేజీ డివైడర్లు బస్సుల రాకపోకలకు ఆటంకంగా మారుతున్నాయని తెలిపారు. రహదారులను ఎత్తు పెంచి సీసీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles