HomeWarangal Newsక్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతానని మోసాలు: నిందితుడు అరెస్ట్

క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతానని మోసాలు: నిందితుడు అరెస్ట్

Published on

spot_img

వరంగల్, జనవరి 27: క్రెడిట్ కార్డ్ అమౌంట్ లిమిట్ పెంచుతానని చెప్పి అమాయకులను మోసం చేస్తున్న బలోజు అఖిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం ఈ అరెస్ట్‌ను నిర్వహించింది.

బలోజు అఖిల్ గతంలో ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తన వద్దకు వచ్చిన కస్టమర్లను లిమిట్ పెంచుతానని నమ్మించి, వారి క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. దీనిపై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విషయం తెలిసిన ఎస్‌బీఐ బ్యాంక్ అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.

అయినప్పటికీ, అఖిల్ తన మోసాలను కొనసాగించాడు. తాను ఇప్పటికీ ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌గానే పనిచేస్తున్నానని చెప్పి, పాత కస్టమర్లను సంప్రదించాడు.

హనుమకొండకు చెందిన ముగ్గురు బాధితుల నుంచి సుమారు రెండు లక్షల రూపాయలు, హుస్నాబాద్‌కు చెందిన మరో బాధితుడి నుంచి 1,40,000 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకుని మోసం చేశాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, “సర్వీస్ సెంటర్లు, మీసేవ సెంటర్లు మరియు ఇతర రిటైలర్లు క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఫిజికల్‌గా రాకుండా, ఎవరైనా కార్డ్ పంపితే లేదా మరో వ్యక్తి తెచ్చి ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పినా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. ఫోన్‌లో మాట్లాడి ఓటీపీ చెప్పి కూడా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయరాదు.

గుర్తుతెలియని వ్యక్తులు తెచ్చిన కార్డులతో ట్రాన్సాక్షన్ చేస్తే, తదుపరి చర్యలకు బాధ్యులవుతారు” అని హెచ్చరించారు.

పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఐ20 ఆస్టా కారు, 10,000 రూపాయల నగదు, 30,000 రూపాయల విలువైన గూగుల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్రెడిట్ కార్డ్ సంబంధిత విషయాలను బ్యాంకుకు వెళ్లి సిబ్బందితో మాత్రమే చర్చించాలని ఇన్స్పెక్టర్ సూచించారు. మరిన్ని మోసాలు జరగకుండా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest articles

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ముంబై ఎక్స్‌పోలో పాల్గొన్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ పరిజ్ఞాన ప్రదర్శన 'IFAT India 2026' సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
spot_img

Related Articles

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వేయి స్తంభాల గుడిలో ‘ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి’ ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి.

NDA పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈ నెల 13న నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు సంబంధించి పింగిలి కళాశాల పరీక్ష కేంద్రాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించారు. కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.