HomeLatest NewsVaibhav Sooryavanshi: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న సూర్య‌వంశీ ఫన్నీ వీడియో..!

Vaibhav Sooryavanshi: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న సూర్య‌వంశీ ఫన్నీ వీడియో..!

Published on

spot_img

Vaibhav Sooryavanshi: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న సూర్య‌వంశీ ఫన్నీ వీడియో :

ఐపీఎల్ 2026 సీజన్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన యువర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఈసారి అతని బ్యాటింగ్ కాదు అవార్డు ప్రధానోత్సవ వేడుకల్లో చెప్పిన సరదా సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సూర్యవంశీ అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు.

అంతేకాకుండా సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. అవార్డు స్వీకరణ అనంతరం జరిగిన సంభాషణలో మాజీ భారత క్రికెటర్ రవి శాస్త్రి , సూర్యవంశీని ప్రశంసిస్తూ.. “ఇంత భారీ షాట్లు ఎలా కొడుతున్నావు..? నీకు అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది..? రోజుకి ఎన్ని గ్లాసుల పాలు తాగుతావు..?” అని సరదాగా ప్రశ్నించాడు.

దీనికి వైభవ్ సూర్యవంశీ చిరునవ్వుతో సమాధానమిస్తూ..”ఇప్పుడు నేను పాలు తాగడం లేదు సార్” అని చెప్పాడు. అతని సమాధానం విన్న వెంటనే అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. రవి శాస్త్రి, సూర్యవంశీ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులను అలరిస్తుంది. యువ క్రికెటర్ హాస్యచతురతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

వినాయకుడికే తొలి పూజ ఎందుకు? హిందూ సంప్రదాయంలోని అసలు రహస్యం!

ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే వినాయకుడినే మొదట పూజించడానికి ఉన్న ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాలు ఏమిటి? విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా గణపతికి ఈ ప్రత్యేక స్థానం ఎలా లభించిందో తెలుసుకుందాం.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు: రూ. 2 లక్షల ఉచిత బీమా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సంక్షేమం దృష్ట్యా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 2 లక్షల ఆరోగ్య/జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.