వరంగల్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు పలు ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు.
వడ్డేపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన వినయ్ భాస్కర్ గారు, ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం బాలసముద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి, హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు.


