HomeWarangal Newsపార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెబుతాం: దాస్యం వినయ్ భాస్కర్

పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెబుతాం: దాస్యం వినయ్ భాస్కర్

Published on

spot_img

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 11వ, 29వ డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం శుక్రవారం రామన్నపేటలోని మణిదీప గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆశీర్వాదం, దేవుని అనుగ్రహం, కార్యకర్తల కృషితో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు తెలిపారు. తనకు ప్రజాసేవ తప్ప మరో వ్యాపారం లేదని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటానని అన్నారు.

కరోనా సమయంలో వేలాది కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడంతో పాటు వైద్య సేవలు అందేలా కృషి చేశామని పేర్కొన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.

పార్టీని వీడి వెళ్లిన నాయకుల విషయంలో కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్న ఆయన, “పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెబుతాం.. పార్టీ కోసం పని చేసేవారిని గుండెల్లో పెట్టుకుంటాం” అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వినయ్ భాస్కర్, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పేదల పక్షాన పోరాడానని, భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సమావేశంలో సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్, మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి ఆన్‌లైన్‌లో చేపట్టనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దర్శన్ సింగ్, మర్రి యాదవ రెడ్డి, వద్దిరాజ్ గణేష్, జోరిక రమేష్, కాయిత రఘువీర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles