HomeWarangal NewsDr Kadiyam Kavya | దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే

Dr Kadiyam Kavya | దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే

Published on

spot_img

హనుమకొండ

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది

విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ఆయుధం

క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు

విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకం ౼ వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

హనుమకొండ, పెద్దపెండ్యాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించిన ఆరోహన్-2025 వార్షికోత్సవ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా ఎంపీ డా.కడియం కావ్య జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

DPS

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ… దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ప్రధాన ఆయుధమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని అన్నారు.

Kids

అలాగే ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి భయపడకుండా ముందుకు సాగాలని ప్రోత్సహించారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌, టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. వైఫల్యాలను భయపడకుండా అవే విజయానికి మెట్లుగా మలచుకోని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు తమ కెరీర్ ఎంపికలో ఇతరుల ఒత్తిడికి లోనుకాకుండా తమ ఇష్టాలను, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో తప్పక విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేయడంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో నిరంతరం నిర్వహించాలని ఎంపీ సూచించారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు ఎంపీ సర్టిఫికెట్ లు, మెమెంటో లను అందజేసారు. అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య విద్యార్థులతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరించారు.

Arohan 2025

ఈ కార్యక్రమంలో NIT వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాదర్ సుబుద్ధి, డీపీస్ డైరెక్టర్ రాజి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, వైస్ చైర్మన్ రవి కిరణ్ రెడ్డి, ప్రిన్సిపల్ ఇన్నా రెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.