వరంగల్: గీసుకొండ (Geesukonda) మండలంలోని ధర్మారం(dharmaram) గ్రామంలో అదే విధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇండేన్ గ్యాస్(Indane Gas) సిలిండర్ల పంపిణీ లో డెలివరీ ఆలస్యం కావడం.
అలాగే నిర్వాహకుల వైఖరి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.
గ్యాస్ డీలర్ల (Gas Dealers) సక్రమంగా పంపిణీ లేకపోవడంతో వినియోగదారులు సిలిండర్ల కోసం చాలా సార్లు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నట్లు అక్కడ స్థానికులు కూడా తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే గీసుకొండ (Geesukonda) మండలంలోని ధర్మారం (Dharmaram) గ్రామంలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు భారీగా లైన్లో నిలబడ్డారు.
దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఒకేసారి అంత పెద్ద సంఖ్యలో వినియోగదారులు సిలిండర్లు (Gas Cylinders) పొందేటందుకు నేరుగా అక్కడికి రావడంతో రద్దీ పెరిగిపోయింది.
జనాలు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉండటంతో క్యూ లైన్ లు బారులుగా పెరిగిపోయాయి.
దీంతో ప్రజల్లో అసౌకర్యం కలగడంతో పాటు కొంతమేర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని గమనించిన అక్కడే ఉండే స్థానికుల వెంటనే “Dial 100” కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే గీసుకొండ (Geesukonda) పోలీసులు తక్షణమే అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితిని సమీక్షించి ప్రజలు శాంతంగా ఉండాలి అంటూ కోరారు.
గ్యాస్ సిలిండర్ల (Gas Cylinders) పంపిణీ ప్రక్రియలో ఏర్పడిన పరిస్థితిని చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. పోలీసులు క్యూ లైన్ లను క్రమబద్దీకరించారు.
అంతేకాదు పోలీసులు, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సిలిండర్ల (Gas Cylinders) పంపిణీ సజావుగా కొనసాగించేందుకు ఏజెన్సీ సిబ్బందితో సమన్వయంగా ముందుకు వెళ్లారు.
అవసరమైన సూచనలను ఇస్తూ ప్రతి వినియోగదారుడు క్రమంగా తన వంతు వచ్చినప్పుడు మాత్రమే సిలిండర్ ( Gas Cylinders) తీసుకునేలా చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా పోలీసులు సూచనలు పాటిస్తూ సహకరించడంతో పరిస్థితి పూర్తిగా సాధారణమైంది.
సమయానికి స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినందుకు గీసుగొండ (Geesukonda) పోలీసులకు గ్రామస్తులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈ ఘటనతో అత్యవసర సేవల ప్రాముఖ్యత మరోసారి స్పష్టమైంది.
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామంటూ సంబంధిత వర్గాలు కూడా తెలుపుతున్నాయి.


