ధర్మసాగర్ | ఏప్రిల్ 15, 2026
ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గంటే సాంబరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ నేపథ్యంలో, ఆయన కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడేందుకు చిన్ననాటి స్నేహితులు ముందుకు వచ్చారు.
ధర్మసాగర్ ప్రభుత్వ పాఠశాల 2002–2003 బ్యాచ్‌కు చెందిన స్నేహితులు కలిసి రూ.67,000 సేకరించి కుటుంబానికి అందించారు. అలాగే, సాంబరాజ్‌తో కలిసి పనిచేసిన దేవాదుల పంప్ హౌస్ సహచరులు రూ.34,000, చిన్ననాటి మిత్రుడు మేకల కుమార్ (ఎస్.ఐ) రూ.10,000, యాదవ సంఘం పెద్దలు రూ.18,000 చొప్పున సహాయం అందించారు.
ఈ విధంగా మొత్తం రూ.1,29,000ను సాంబరాజ్ కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా జమ చేసి, సంబంధిత డిపాజిట్ బాండ్ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ చర్యతో చిన్నారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించారు.
ఈ కార్యక్రమంలో శాతవేణి రాజ్ కుమార్, పుట్ట రజినీకాంత్, MD. హఫీజ్, మేకల బిక్షపతి, K. గురుమూర్తి, P. ప్రశాంత్, P. రవీందర్, పోసు నాగరాజు, బొడ్డు భరత్, పి. చిరంజీవి, పోలుమారి ప్రపుల్, Ch. అనిల్, కళ్లేపు రాజు, శేషాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


