ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బండి భగీరథ్ పేరు మారుమ్రోగిపోతుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ ని కఠినంగా శిక్షించాలి అని జనాలు కోరుతున్నారు.
అయితే ఈ కేసులో రోజురోజుకి ఊహించని ట్విస్ట్ లు ఎక్కువగా బయటపడుతున్నాయి.
సినిమాకి మించిన రేంజ్ లో ఒక్కొక్క ట్విస్ట్ బయటపడుతూ ఉండడంతో జనాలు షాక్ అయిపోతున్నారు.
రీసెంట్గా బండి భగీరథ్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడటంతో మరొకసారి ఈ కేసు సంచలనంగా మారింది.
బండి భగీరథ్ వాడిన అత్యాధునిక ఐఫోన్ లోని డేటాను కీలక వీడియోలను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నెల 8న బండి భగీరథ్ పై పేట్‌బషీరాబాగ్ లో కేసు నమోదు అయింది.
అయితే కేసు నమోదు కాగానే నిందితుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
అంతేకాదు స్విచ్ ఆఫ్ చేయకముందు అందులోని సోషల్ మీడియా అకౌంట్ లన్ని డిలీట్ చేసినట్లు తెలుస్తుంది.
బండి భగీరథ్ పై కేసు నమోదు నాటి నుంచి అరెస్టు వరకు హై డ్రామాలతో సాక్ష్యలను తారుమారు చేసే అంశానికి పాల్పడినట్లు ఇప్పటికీ పలు ఆరోపణలు బయటపడ్డాయి.
అంతేకాదు పోలీసులు ఈ కేసులో ఒక్క ప్రూఫ్ కూడా కనిపెట్టలేని విధంగా బండి బండి భగీరథ్ సోషల్ మీడియా అకౌంట్ లన్ని మొత్తం డిలీట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగానే ఫోన్ ని పలుమార్లు ఫార్మాట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అంతేకాదు నిందితుడు చాలా తెలివిగా సాక్ష్యాలను తారుమారు చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు.
అయితే అంతకు వంద రెట్లు పవర్ఫుల్ టెక్నాలజీతో పోలీసులు అతని ఉచ్చుబిగించేందుకు సన్నహాలు రెడీ చేసినట్లు సమాచారం .
ఐఫోన్‌లో సెక్యూరిటీ ఫీచర్లు అత్యంత కఠినంగా ఉంటాయి అని అందరికి తెలిసిందే.
అందుకే నిందితులు ఐఫోన్‌లో డాటాను డిలీట్ చేస్తే పోలీసులు ఏమి చేయరనే ధీమాలో ఉంటారని అనుకున్నాడు ఏమో..
కానీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణుల వద్ద అత్యంత ఆధునిక సాప్ట్‌వేర్లు అందుబాటులో ఉంటాయన్న విషయం మర్చ్పోయిన్నట్లు ఉన్నాడు.
హై టెక్నాలజీ ఉపయోగించి వివిధమార్గాల ద్వారా డిలీట్ అయిన డాటాను 100% రిట్రీవ్ చేయచ్చు.
అడ్వాన్స్‌డ్ ఫోరెన్సిక్ టూల్స్‌తో ..సెలిబ్రైట్ వంటి అంతర్జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ సాఫ్ట్‌వేర్‌ల తో..
ఐఫోన్‌లోని ఫ్లాస్ మెమొరీ నుంచి డిలీట్ అయిన డాటాలోని చాటింగ్, వీడియోలు, ఫొటోలను రికవరీ చేసే విధంగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడానికి ముందు ఎక్కడ ఉన్నాడు..? అసలు ఎవరితో ఉన్నాడు..? ఏం మాట్లాడాడు..? చట్టం నుంచి అతనికి ఆశ్రయం కల్పించింది ఎవరు? అసలు ఈ బండి భగీరథ్ వెనక ఎవరెవరు ఉన్నారు ..?
అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఆ కారణంగానే ఆ వివరాలు తెలుసుకోవడానికి సెల్ టవర్ మ్యాపింగ్ , కాల్ డేటా రికార్డులు కూడా పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.
అంతేకాదు అవసరమైతే ఈ కేసులో బాధితురాలు ఫోన్ సైతం మరో సాక్ష్యంగా మార్చే విధంగా పోలీసులు “ప్లాన్ బి” కూడా రెడీ చేసుకున్నారట.
నిందితుడు బాధితురాలికి పంపిన బెదిరింపులు అదే విధంగా మెసేజ్లు , ఫోటోలు , వీడియోలు ప్రతి ఒక్కటి సేకరించి దానిని రిసీవ్డ్ డేటాలో పటిష్టమైన ప్రాథమిక సాక్ష్యాలుగా కోర్టుకు సమర్పించబోతున్నట్లు తెలుస్తుంది .
ఈ పొక్సో కేసులో సాక్ష్యాలను తారుమారు కు ప్రయత్నించడం కూడా నేరతీవ్రతలు మరింతగా పెంచుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు ప్రముఖులు.
ఇవన్నీ చూస్తుంటే బండి భగీరథ్ పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకుముందు కూడా ఇలా ఏమన్నా చేశారా..? అనే కోణంలో జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఎంత తెలివైన వాడు అయినా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదు ..
చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అంటూ జనాలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ బండి భగీరథ్ కి శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు..!


