HomeLatest Newsడిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో వృద్ధురాలికి వల: రూ.21 లక్షలు స్వాహా

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో వృద్ధురాలికి వల: రూ.21 లక్షలు స్వాహా

Published on

spot_img

ఎల్బీనగర్‌: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. భయాందోళనకు గురిచేసి ఓ వృద్ధురాలి నుంచి రూ. 21 లక్షలు కాజేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్కేపురం కాలనీకి చెందిన నాగలక్ష్మి (68) అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఇటీవల ప్రసాద్ అనే వ్యక్తి టెలికాం అధికారినంటూ ఆమెకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత రాజేశ్‌కుమార్ అనే మరో వ్యక్తి తాను న్యాయ సలహాదారుడినంటూ పరిచయం చేసుకున్నాడు. బాధితురాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు.

అనంతరం సైబర్ కేటుగాళ్లు సీబీఐ, పోలీసు అధికారుల అవతారమెత్తి వీడియో కాల్ ద్వారా విచారణ పేరిట నాగలక్ష్మిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు. అరెస్టు భయంతో ఆందోళన చెందిన ఆమె, నిందితులు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా రూ. 21 లక్షలు బదిలీ చేసింది. అయినప్పటికీ, ఇంకా డబ్బులు పంపాలని నిందితులు ఒత్తిడి తేవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు, ఈ నెల 5న తన కుమారుడికి విషయాన్ని తెలిపింది.

బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు స్పందిస్తూ… పోలీసు, సీబీఐ లేదా ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో బెదిరిస్తూ వీడియో కాల్స్ చేస్తే ఎవరూ భయపడవద్దని, ఎలాంటి డబ్బులు బదిలీ చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.