SIR సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద:
వరంగల్ జిల్లాలో జరుగుతున్న SIR సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికి చేరుకొని అర్హుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఈ ఎస్ ఐ ఆర్ పరిశీలనలో జెడ్పిసిఈఓ రామ్ రెడ్డి, దుగ్గొండి ఎమ్మార్వో సమ్మక్క , బి ఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.


