హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం, వెంకటేశ్వరపల్లిలో ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలోని జనావాసాల్లోకి చొరబడి ఎదురుపడ్డ వారిపై విచక్షణారహితంగా దాడి చేసింది.
ఈ దాడిలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలుగురు చిన్న పిల్లలు కాగా, ఒకరు పెద్దవారు. గాయపడిన వారిని వెంటనే స్థానికులు గమనించి కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించారు.
తీవ్రంగా గాయపడిన పదేళ్ల బాలికను పరిస్థితి దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం చైల్డ్ స్పెషలిస్ట్ వద్దకు రెఫర్ చేశారు.


