HomeWarangal NewsKadiyam Kavya।యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్న

Kadiyam Kavya।యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్న

Published on

spot_img

న్యూఢిల్లీ – పార్లమెంట్: యోగ, ఆయుష్ సేవల విస్తరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

దేశంలో యోగా ప్రచారం, హర్బల్‌ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు.

ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలన్నారు.

ప్రధానంగా యోగా ప్రచార కార్యక్రమాల వివరాలు

గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వెల్లడించాలన్నారు.

హర్బల్‌ మందుల నాణ్యత

దేశంలో హర్బల్‌ ఔషధాల నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం ఎలాంటి పర్యవేక్షణ వ్యవస్థ అమలు చేస్తోంది? లైసెన్స్ పొందిన తయారీదారుల సంఖ్య ఎంత? గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న కొరతను నివారించేందుకు ఏ చర్యలు తీసుకున్నారో అనే అంశాలపై ఎంపీ డా. కడియం కావ్య స్పష్టత కొరారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ

AYUSH సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడానికి ప్రభుత్వం ఎన్ని మొబైల్‌ యూనిట్లు పంపిణీ చేసింది? ఇప్పటివరకు ఎన్ని గ్రామాలు వీటి పరిధిలోకి వచ్చాయి? స్థానిక స్వయం సహాయక సంఘాలతో చేపట్టిన సహకార కార్యక్రమాలపై వివరాలు ఇవ్వాలని కోరారు.

ఈ మేరకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి గణపత్రావ్ జాదవ్ సమాధానమిచ్చారు.

2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం “One Earth, One Health” థీమ్‌తో నిర్వహించగా, విశాఖపట్నంలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన మహార్యాలీకి 3.02 లక్షల మంది హాజరయ్యారని మంత్రి తెలిపారు.

దేశవ్యాప్తంగా 13.64 లక్షల యోగ సంగమ్ ఈవెంట్లు నిర్వహించబడినట్లు చెప్పారు.

2024 యోగా దినోత్సవం “Yoga for Self and Society” థీమ్‌తో శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై 7,000 మంది పాల్గొన్న ప్రధాన కార్యక్రమం నిర్వహించగా, జమ్మూ–కాశ్మీర్ జిల్లాల్లో మరో 20,000 మంది పాల్గొన్నారని తెలిపారు.

పుణే, సూరత్, బోధ్ గయాల్లో జరిగిన ప్రీ–ఈవెంట్లకు వేలాది మంది హాజరయ్యారని వివరించారు. 2024–25లో యోగ, ఆయుష్ ప్రచారం కోసం ఐఈసీ పథకం కింద రూ.43.20 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

హర్భల్, ఆయుష్ మందులకు ప్రమాణాలు నిర్ణయించే బాధ్యత ఫార్మకోపియా కమిషన్‌దని మంత్రి తెలిపారు.

ఉత్పత్తి, ఎగుమతులు, మౌలిక వసతులు బలోపేతానికి “AOGUSY” పథకం క్రింద చర్యలు చేపట్టారని చెప్పారు. 34 రాష్ట్ర ల్యాబ్‌లు అప్‌గ్రేడ్ చేయబడి, 108 ల్యాబ్‌లు టెస్టింగ్ కోసం లైసెన్స్ పొందినట్లు వెల్లడించారు.

జాతీయ ఆయుష్ మిషన్‌ కింద 150 గిరిజన గ్రామాలకు మొబైల్ యూనిట్లు వెళ్లి, 3 లక్షల మందికి ఆరోగ్య పరీక్షలు, మందులు, యోగ తరగతులు అందించాయని మంత్రి తెలిపారు.

‘ఆయుష్ గ్రామం’ ప్రాజెక్ట్ ద్వారా స్వయంసహాయక సమూహాలతో కలిసి ఆరోగ్య అవగాహన, జీవనశైలి మార్పులు, ఇంటివద్ద హర్భల్ చికిత్సలపై ప్రచారం జరుగుతుందని చెప్పారు.

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం హామీ

గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర హోలిస్టిక్ హెల్త్ సేవల లోటు ఉన్నదన్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి, ఆయా సేవల విస్తరణపై చర్యలు కొనసాగిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.