HomeWarangal Newsతెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాక్టర్ కడియం కావ్య..!

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాక్టర్ కడియం కావ్య..!

Published on

spot_img

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాక్టర్ కడియం కావ్య :

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని హనుమకొండలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఆమె పలు కార్యక్రమాలలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. మొదట అదాలత్ సర్కిల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం హనుమకొండ పరేట్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రధాన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరై వేడుకలను వీక్షించారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించి.. దేశ స్వాతంత్ర్యం కోసం వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించిన డాక్టర్ కడియం కావ్య.. ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు అందించిన వివరాలను తెలుసుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేపడుతున్న చర్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles