హనుమకొండ | తేదీ: 06-04-2026 (సోమవారం)
హనుమకొండలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో సోమవారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఫుడ్ సేఫ్టీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘EAT RIGHT WALK’ (ఆహార భద్రతపై ప్రత్యేక దినం) కార్యక్రమం నిర్వహించారు.
పబ్లిక్ గార్డెన్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించగా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు ప్రజల ఆరోగ్య రక్షణకు దోహదపడతాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


