వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) పరిధిలోని పైడిపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు.
పైడిపల్లిలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని, అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈవీ బస్సుల నిర్వహణ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని, దీనివల్ల ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.


