HomeWarangal Newsప్రభుత్వ భూములని ఆక్రమిస్తే కఠిన చర్యలు: కాజీపేట తహసీల్దార్

ప్రభుత్వ భూములని ఆక్రమిస్తే కఠిన చర్యలు: కాజీపేట తహసీల్దార్

Published on

spot_img

వరంగల్ కార్పొరేషన్: నగరంలోని న్యూ శాయంపేట జంక్షన్ లో సర్వేనెంబర్ 23లో ఉన్న ఐదు ఎకరాల స్థలం ప్రభుత్వానికి చెందినది అని అధికారులు స్పష్టం చేశారు.

ఈ స్థలంలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. అదే రోజు రాత్రి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే.

దీనిపై హనుమాన్ భక్తులు అదే విధంగా స్థానికులు మంగళవారం న్యూ శాయంపేట జంక్షన్ లో ఆందోళనకు కూడా దిగారు.

దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమయానికి పోలీసులు చేరుకొని అంతా పరిస్థితిని చక్కదిద్దారు.

ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని సొంత పూచికత్తుపై వదిలేశారు.

ఈ విషయానికి సంబంధించి జిడబ్ల్యుఎంసి, రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. “సర్వే నెంబర్ 23లో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది అని..

ఇందులో కొంత గుట్ట ప్రాంతం ఉండగా.. అక్కడ కూలీలు గుట్టను తొలగించి జీవనోపాధి పొందాలని తెలిపారు”.

ఆ తర్వాత గుట్ట కింద తేలిన భూమితో పాటు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో రెండు రోజుల క్రిందట కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దేవుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని…

సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ జిడబ్ల్యూఎంసి, డిఆర్ఎస్ పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి సుమారు 20 కోట్ల ప్రభుత్వ భూమిని రక్షించడం జరిగింది అని తెలిపారు.

ఇది పక్కా ప్రభుత్వ భూమి అని చెప్పారు. కబ్జా చేయాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

న్యూ శాయం పేట గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ బంచరాయి భూమిని సమన్వయంతో పరీక్షించినట్లు కాజీపేట తహసీల్దార్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ భూమిలో గతంలో అక్రమ మైనింగ్ నిర్వహించడంతోపాటు భారీ గుంతలు ఏర్పడి భూమి నిరుపయోగ స్థితికి చేరుకుందని..

అనంతరం భద్రకాళి చెరువు పూడిక మట్టిని ఉపయోగించి ఆ గుంతలను పూడ్చి ప్రజాప్రయోజనార్థం ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

కానీ కొందరు వ్యక్తులు ముందస్తు అనుమతులు పొందకుండా దేవాలయం పేరుతో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించామని..

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి రెవెన్యూ అధికారులు, పోలీసు శాఖ పరస్పర సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని రక్షించడం జరిగింది అని తెలిపారు.

కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించడమే కాకుండా వివాదాస్పద పరిస్థితులు సృష్టించి ప్రజలకు అసౌకర్యం కలిగించిన నేపథ్యంలో వారిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా తహసీల్దార్ తెలిపారు.

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.