ఎట్టకేలకు ఎనుమాముల మార్కెట్‌కు కొత్త బాస్.. నాలుగేళ్ల తర్వాత కీలక నియామకం!
వరంగల్‌లోని ప్రముఖ వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ కమిటీకి ఎట్టకేలకు కొత్త పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌తో పాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎర్ర ప్రియాంకను నియమించగా, వైస్ చైర్మన్‌గా బండి జనార్ధన్ బాధ్యతలు చేపట్టారు. సభ్యులుగా గండరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, సల్లా వాగ్దేవరెడ్డి, గొడుగు భిక్షపతి, బాదావత్ నర్సింహానాయక్, ఆకుల రుద్రప్రతాప్, బొడ్డు ప్రదీప్ కుమార్, కత్తి సంపత్, మహ్మద్ సబేరా, అక్స నాగరాజ్, దుగ్యాల గోపాల్‌రావు, గజ్జల శ్యామ్‌సుందర్ తదితరులను నియమించారు.
అదేవిధంగా అసన్‌పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, వరంగల్ మేయర్‌లను కూడా కమిటీ సభ్యులుగా చేర్చారు. బుధవారం ఎనుమాముల మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన పాలకవర్గ సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఎర్ర ప్రియాంక మార్కెట్ చైర్మెన్ గా ఛార్జ్ కూడా తీసేసుకున్నారు. మార్కెట్ పరిధిలోని గ్రామాల రైతులు, వ్యాపార వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొత్త పాలకవర్గం మార్కెట్ అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యాపార సౌకర్యాల మెరుగుదలకు కృషి చేయాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
FAQ’s
ఎనుమాముల మార్కెట్ కొత్త చైర్మన్ ఎవరు?
ఎర్ర ప్రియాంకను తెలంగాణ ప్రభుత్వం ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించింది.
ఎనుమాముల మార్కెట్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు.
ఎనుమాముల మార్కెట్ ఎక్కడ ఉంది?
ఎనుమాముల మార్కెట్ వరంగల్ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటి.
కొత్త కమిటీ ఎప్పుడు బాధ్యతలు చేపట్టింది?
2026 జూన్ నెలలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది.
Read Warangal News and Latest Politics News and Real Estate

