HomeWarangal Newsరైతుల ఆవేదనకు అండగా నిలిచిన ఎర్రబెల్లి.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

రైతుల ఆవేదనకు అండగా నిలిచిన ఎర్రబెల్లి.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Published on

spot_img

రైతుల ఆవేదనకు అండగా నిలిచిన ఎర్రబెల్లి.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ధర్మాపురంలో మాజీ మంత్రి వాహనాన్ని అడ్డుకున్న రైతులు :

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధర్మాపురం గ్రామంలో శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్న సమయంలో రైతులు ఆయన వాహనాన్ని అడ్డుకొని తమ సమస్యలను వివరించారు. పండించిన ధాన్యం కొనుగోలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు మాట్లాడుతూ..”గతంలో పంట దిగుబడులకు సరైన మద్దతు లభించేదని.. ప్రస్తుతం మాత్రం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నిలువలు పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పంటను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో కల్లాల వద్దే కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎర్రబెల్లి విమర్శలు :

రైతుల సమస్యలను విన్న అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..”రాష్ట్రంలో రైతులను ఇంతటి ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పేరుకుపోయిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని బాధపడ్డారు. బస్తాల కొరత, లారీల లభ్యత లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విమర్శించారు”.

రైతు సంక్షేమంపై ప్రశ్నలు :

సకాలంలో రైతు బంధు అందడం లేదని..విత్తనాలు ఎరువుల సరఫరాల్లో కూడా సమస్యలు ఉన్నాయని ఎర్రబెల్లి ఆరోపించారు. పంట పండించిన రైతులకు సరైన కొనుగోలు సౌకర్యాలు కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తే చివరకు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది అన్నార. రైతు చెమటతో పండిన ప్రతి గింజకు విలువ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ :

రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లని వెంటనే వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles