హనుమకొండ:
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు, వరంగల్ మాజీ మేయర్ శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారిని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీలో దీర్ఘకాలంగా సేవలందిస్తూ మహిళా విభాగంలో చురుకుగా పనిచేసిన స్వర్ణ గారికి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ మాజీ మేయర్‌గా పనిచేసిన ఆమెకు మంచి రాజకీయ అనుభవం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు.


