HomePoliticsగాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతల స్వీకరణ

గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతల స్వీకరణ

Published on

spot_img

హైదరాబాద్ | తేది: 15-03-2026

గాంధీ భవన్‌లోని ప్రకాశం హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య గారు ఎర్రబెల్లి స్వర్ణ గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.

Mahila Congress

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. మహిళలు రాజకీయాలు, సామాజిక రంగాల్లో మరింత చురుకుగా పాల్గొనేలా మహిళా కాంగ్రెస్ కీలక వేదికగా నిలుస్తోందన్నారు.

ఎర్రబెల్లి స్వర్ణ గారి నాయకత్వంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతూ మహిళల సమస్యల పరిష్కారానికి బలమైన స్వరం అవుతుందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళలను సంఘటితం చేసి పార్టీని బలోపేతం చేయడంలో మహిళా కాంగ్రెస్ ముందుండాలని సూచించారు.

మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ గారు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీతా రావ్ గారు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.